Thursday 1 September 2011

శృతి హాసన్ తనని నిర్లక్ష్యం చేస్తోందని ఆ హీరో

శృతి హాసన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలెట్టిన సిద్దార్ధ ఇప్పుడు ఆమె తనని నిర్లక్ష్యం చేస్తోందని ఫీలవుతున్నాడు. ఆమె తమిళ చిత్ర పరిశ్రమలో కెరీర్ కోసం అక్కడ హీరో సూర్య ని కాకా పట్టే పనిలో ఉంది. సూర్య తో క ఆమె రీసెంట్ గా ఓ పంక్షన్ కి అటెండయింది. ఆ విషయం తెలుసుకున్న సిద్దార్ధ మండిపడ్డాడని తెలుస్తోంది.అంతేగాక తనతో చేస్తున్న ఓ మై ప్రెండ్ సెట్స్ పై ఆమెను డామినేట్ చేయటానికి చూస్తే ఆమె లెక్క చెయ్యకపోవటం కూడా అతన్ని డైలమోలో పడేసింది.దాంతో ఆమెని ఏమీ అనలేక చుట్టుప్ర్ క్కల వారిపై చీటికీ మాటికి విరుచుకు పడటం చేస్తున్నాడు. అయితే శృతి ఈ విషయాన్ని చూసి చూడనట్లు గా బిహేవ్ చేస్తోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.శృతిహాసన్ , సూర్యల కాంబినేషన్‌ లో తమిళంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘7ఆమ్ ఆరివు’. రెడ్ జైంట్ మూవీస్ పతాకంపై ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో అక్టోబర్ 26న విడుదల కాబోతోంది.

ఈ చిత్రంలో సూర్యకు జోడీగా శృతిహాసన్ నటిస్తోంది. ‘సూపర్ మిషన్’ బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ద్వారా వియత్నాంకు చెందిన జాని ట్రింజియన్ విలన్‌ గా పరిచయమవుతున్నాడు. కాగా ‘గజిని’ చిత్రంలో షార్ట్ టర్మ్ మెమోరీ లాస్ పేషెంట్‌ గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్న సూర్య ఈ చిత్రంలో సైంటిస్ట్‌ గా, బౌద్ధ సన్యాసిగా, సర్కస్ కళాకారుడిగా మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ మూడు పాత్రల్లో ఒకటైన బౌద్ధ సన్యాసిగా సూర్య నటించిన పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని కోలీవుడ్ సమాచారం. అలాగే సర్కస్ కళాకారుడిగా నటించిన సూర్య ఈ పాత్ర కోసం వియాత్నాంలో కుంగ్‌ఫూ కు సంబంధించి ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిసింది. గ్రాఫిక్స్‌ కు అత్యంత ప్రాధాన్యమున్న ఈ చిత్రంలోని గ్రాఫిక్స్‌ ని జెమ్స్ కె మెరున్ అద్భుతసృష్టి ‘అవతార్’, అలాగే శంకర్ దర్శకత్వం వహించిన రోబో’ చిత్రాలకు స్పెషల్ ఎఫెక్ట్స్‌ ని అందించిన స్టార్ విన్స్‌ స్టన్ స్టూడియో అందిస్తోందట. ఇన్ని ప్రత్యేకతలతో రూపొందుతున్న ఈ చిత్రానికి తెలుగులో ‘ సెవెంత్ సెన్స్’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నారని, ఈ చిత్రాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ పతాకంపై బి. సుబ్రహ్మణ్యం తెలుగు ప్రేక్షకులకు అందించబోతున్నాడని తెలుస్తోంది.

No comments:

Post a Comment