మన టాలీవుడ్ విషయానికొస్తే సాధారణంగా ఇండస్ట్రీలో ఓ స్థాయికి ఎదిగిన ప్రముఖులు తమ వారసులను అంటే...కొడుకులను, కూతుర్లను, మనవళ్లు సినిమాల్లో నిలదొక్కుకునేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక దర్శకుడు మాత్రం ఇందుకు భిన్నంగా తన తండ్రికి మంచి బ్రేక్ ఇచ్చేందుకు కష్ట పడుతున్నాడు.
మేం ఎవరి గురించి మాట్లాడుతున్నామో మీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. అతనెవరో కాదు...ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం నాగార్జున హీరోగా రాజన్న అనే సినిమా తెరకెక్కిస్తున్నారు. విజయేంద్రప్రసాద్ గతంలోనే దర్శకుడుగా పరియం అయినప్పటికీ పెద్దగా నిలదొక్కుకోలేక పోయాడు.
అయితే ఇప్పడు తండ్రిని పైకి తీసుకొచ్చే బాధ్యతలను భుజాన వేసుకున్న రాజమౌళి....రాజన్న సినిమాను దగ్గరుండి చూసుకుంటున్నారు. యాక్షన్ సన్ని వేశాలకు తానే స్వయంగా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మరి రాజమౌళి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో? కొడుకు చలవతోనైనా విజయేంద్ర ప్రసాద్ స్టార్ డైరెక్టర్ గా ఎదుగుతాడో..చూడాలి మరి.

No comments:
Post a Comment