బావు దర్శకత్వంలో రూపొందిన శ్రీరామరాజ్యంలో ప్రతి నాయకుడు లేకపోవడం వల్ల బాలకృష్ణ అభిమానులు శ్రీరామరాజ్యం సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారోననే అనుమానాలను మీడియా వ్యక్తం చేస్తోంది. ఎన్టీ రామరావు నటించిన లవకుశ సినిమా ఆధారంగా నిర్మిస్తున్న శ్రీరామరాజ్యంలో ప్రతినాయకుడు రావణుడు ఉండడు. ఆధునిక కాలంలో విలన్ లేకుండా సినిమా హిట్టవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, శ్రీరామరాజ్యం సినిమా ఆరంభంలో ఓ పది, పదిహేను నిమిషాల పాటు రావణుడు దర్సనమిస్తాడు. రామరావణ యుద్ధంతో బహుశా సినిమా మొదలవుతుంది. ఈ పది, పదిహేను నిమిషాల నిడివిలో రావణుడిగా కూడా శ్రీరామరాజ్యంలో బాలకృష్ణనే పోషించాడని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
శ్రీరామరాజ్యం సినిమా స్టిల్స్ విషయంలో కూడా గోప్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే, రాముడి పాత్రలో బాలయ్య స్టిల్ ఒక్కటి ఇటీవల మీడియాలో హల్‌చల్ చేసింది. సినిమా విడుదలయ్యే వరకు శ్రీరామరాజ్యం సినిమాకు సంబంధించిన సమాచారం ఏ మాత్రం బయటపడకుండా చూడాలని అనుకుంటున్నారు. అయితే, రావణుడి పాత్రలో కూడా బాలయ్య కనిపించాడంటూ ఊహాగానాలు చెలరేగి సినిమా పట్ల మరింత ఆసక్తి పెంచి పోషిస్తున్నారు.

No comments:
Post a Comment