Monday, 29 August 2011

చిరంజీవి ఘాటు సెటైర్ ఎవరిని ఉద్దేశించి?

రంగం వందరోజుల పంక్షన్ కి హాజరైన చిరంజీవి చేసిన కామెంట్ సినీ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. రంగం సినిమాలో విలన్ పాత్ర ముఖ్యమంత్రి అవటం కోసం ఓ కుట్రను పన్నుతుంది. అంతా సక్సెస్ అయ్యి ముఖ్యమంత్రి అయ్యాక ఆ పాత్ర మరణిస్తుంది. కెవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ సన్నివేశంమే సినిమాకి హైలెట్ అయ్యి క్లైమాక్స్ ట్విస్టుగా ప్రేక్షకాదరణ పొందింది. అయితే ఈ పంక్షన్ కి వచ్చిన చిరు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. నాకు దర్శకుడు చేసిన క్లైమాక్స్ నచ్చలేదు. ముఖ్యమంత్రిగా చేసిన విలన్ చచ్చిపోయాక అతని చేసిన అవినీతి పనులు బయిటపడటం ఏమీ చూపలేదు. నేను చాలా డిజప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే అలా ఓ మనిషి చనిపోతే అతను దేవుడుగా మారిపోతాడు. అతని చేసిన చెడ్డ పనులన్నీ ఎప్పటికీ వెలుగు చూడవు అన్నారు. ఇది విన్న వారంతా చిరంజీవి దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్ నే ఉద్దేశించి అంటున్నారని అర్దం చేసుకున్నారు. ఆయన అర్దాంతరంగా మరణించటాన్ని ఇలా సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర చనిపోవటానికి ముడిపెట్టి మాట్లాడుతున్నారని భావిస్తున్నారు. ఇక ఈ పంక్షన్ కి చిరంజీవి మాజీ హీరోయిన్ రాధ కూడా హాజరైంది. ఆమె కూతురు కార్తీక ఈ చిత్రంలో నటించింది.

No comments:

Post a Comment