తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రూపొందిన ‘జై బోలో తెలంగాణ’ సినిమా గోవాలో సెప్టెంబర్ 15 నుంచి జరిగే సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్‌కు ఎంపికయింది. ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ వేడుకలో దక్షిణ ఆసియాకు చెందిన ఎనిమిది దేశాల నుంచి ఎంపికైన దాదాపు 50 సినిమాలు ఇందులో ప్రదర్శింపబడనున్నాయి. ఈ సందర్భంగా ‘జైబోలో తెలంగాణ’ చిత్ర దర్శక, నిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ- ‘‘ఇది తెలుగు సినిమా విజయం. ప్రెస్టేజియస్‌గా జరిగే ఈ వేడుకలో ‘జై బోలో తెలంగాణ’ ఎంపిక అవ్వడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మితమై ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించింది. తెలంగాణ సంప్రదాయాలు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు త్యాగం చేసిన విద్యార్థుల వీర గాథల ప్రధాన అంశంగా తెలంగాణ ప్రజల మనోగతాన్ని అద్దం పట్టే విధంగా మానవీయ కోణంతో ఈ చిత్రం తెరకెక్కింది.

No comments:
Post a Comment