బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ తను అందంలోనే కాక పద్దతుల్లోనూ నెంబర్ వన్ అని నిరూపించుకుంది. తాజాగా ఆమె తాను యుటివి వారినుంచి హీరోయిన్ చిత్రం కోసం తీసుకున్న అడ్వాన్స్ ని తిరిగి ఇచ్చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచేసింది. ఐశ్వర్య రాయ్ గర్భవతి అవటంతో ఆమెను ఆ ప్రాజెక్టు నుంచి తప్పించాడు దర్శకుడు మధూర్ బండార్కర్. దాంతో ఆమె బయిటకు వచ్చి తనకు పే చేసిన డబ్బుని వారు అడగక ముందే ఇచ్చేసింది. ఐశ్వర్య రాయ్ వంటి పెద్ద హీరోయిన్ ని వెనక్కి అడ్వాన్స్ అడగలేమని యుటివి వారు ఊరుకున్నారు. అయితే ఐశ్వర్య మాత్రం పద్దతి పద్దేతేనంటూ ఆ మొత్తాన్ని వారికి గౌరవంగా పంపేసింది. ఇక ప్రస్తుతం ఆమె ప్లేసులో కరీనా కపూర్ ని తీసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్లిన్ మన్రో జీవితాన్ని ఆధారం చేసుకుని మాధుర్ భండార్కర్ రూపొందించనున్నారు. మార్లిన్ మన్రో తన జీవితంలో మూడు సార్లు వివాహం చేసుకుని, అమెరికా అధ్యక్ష్యుడు జాన్.ఎఫ్.కెన్నడీతో నూ ఆయన సోదరుడుతోనూ ఒకే సారి ఎఫైర్స్ నడింపింది. ఇక ఈ సంచలన చిత్రం టైటిల్.. హీరోయిన్, చిత్రనిర్మాత సిద్ధార్థ్ రాయ్ కపూర్.
No comments:
Post a Comment