నా సినిమాలు వరసగా హిట్టు వస్తూండబట్టే నా వెనక హీరోయిన్స్ పడుతున్నారు.నా తో నటించాలని ఉవ్విళ్ళూరుతున్నారు.అదే ఒక్క ప్లాప్ వస్తే వీరవెవ్వరూ కనపించరు.నా నుంచి దూరంగా పరుగులు తీస్తారు అంటున్నాడు సల్మాన్ ఖాన్. సల్మాన్ ఖాన్ సరసన చేయాలని బాలీవుడ్ హీరోయిన్స్ అంతా పోటీపడుతూండటంతో మీడియావారు ఆయన్ని అదే ప్రశ్న అడిగితే ఇలా స్పందించారు.అలాగే నా సినిమాలు ఇటీవల బాగా ఆడుతుండటంతో నాతో కలిసి నటిస్తే పేరొస్తుందని సదరు హీరోయిన్స్ భావించి ఉండొచ్చు. అంతేగానీ వేరే ఉద్దేశ్యంతో కాదు అని తేల్చేసారు. అలాగే తాను 'దబాంగ్'కు సీక్వెల్ లో చేస్తున్నానని చెపుతూ... 'దబాంగ్' ఎక్కడైతే ముగిసిందో అక్కడి నుంచే రెండో భాగం తెరకెక్కుతుంది. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తారు. లక్నో నేపథ్యంగా కథ ఉంటుంది అన్నారు. అలాగే తనపదక్షిణాది సినిమాల్ని రీమేక్ చేసే హీరో అనే ముద్రపడిందన్న విషయం గురించి చెబుతూ...నా దగ్గరకు ఎవరైనా కథతో వచ్చినప్పుడు అది బాగుందా? లేదా? అని చూస్తాను.
అంతేగానీ దక్షిణాదిన విజయం సాధించింది కదా.. ఇక్కడ తీసేస్తే బాగుంటుందని ఆలోచించను. స్క్రిప్టులో కొన్ని మార్పులు అవసరమనిపిస్తే తప్పకుండా చేయిస్తాను. హిందీ ప్రేక్షకుల్ని ఆకట్టుకొనే అంశాల్ని జోడించిన తరవాతే సినిమాలో నటించేందుకు అంగీకరిస్తాను. అందుకే 'వాంటెడ్', 'రెడీ' విజయం సాధించాయి అన్నారు. అలాగే యశ్‌రాజ్ ఫిలిమ్స్‌లో నటించటం గురించి చెబుతూ.. 'ఏక్ థా టైగర్' చిత్ర కథ బాగుంది కాబట్టే.. యశ్‌రాజ్ ఫిలిమ్స్‌లో నటిస్తున్నాను. రొమాంటిక్ తరహా ప్రేమకథలో యాక్షన్‌కి కూడా చోటుంది అన్నారు.ఇక సల్మాన్ స్వయంగా నిర్మించిన 'చిల్లర్ పార్టీ' పెద్దగా ఆడలేదనే విషయం గురించి చెపుతూ...'షోలే' అంత విజయం సాధించాలని నేనేమీ 'చిల్లర్ పార్టీ'ని తీయలేదు. అదో చిన్న పిల్లల సినిమా. చూసిన వాళ్లందరికీ నచ్చింది. అయితే ఎక్కువ మంది చూడకపోయి ఉండొచ్చు. ఒకసారి టీవీల్లో ప్రసారమైతే అందరూ చూస్తారు. అప్పుడు నా ప్రయత్నాన్ని తప్పకుండా మెచ్చుకుంటారు అన్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డు చిత్రం విడుదల కానుంది. ఇక బాడీగార్డు చిత్రంలో సల్మాన్ తన దైన శైలిలో పంచ్ డైలాగులు చెప్పటానికి రెడీ అవుతున్నారు.

No comments:
Post a Comment