త్వరలో సినిమా చేస్తా'నంటూ అమితాబ్ బచ్చన్ సమక్షంలో ఆమధ్య చిరంజీవి ప్రకటించినప్పటికీ, రామ్ చరణ్ తానే నిర్మాతనని ప్రకటించినా, ‘అన్నయ్య సినిమాకి నేనే దర్శకుడ్ని’అంటూ వివి వినాయక్ చెప్పేసుకున్నా, పూరిజగన్నాథ్ తన సొంతబ్యానర్ లో చిరంజీవి నటించబోయే సినిమాని తెరకెక్కిస్తానన్నా ఇప్పటివరకు ఆయన చేస్తారన్న నమ్మకం మాత్రం ఎవరికీ కలగడం లేదు. ఎందుకంటే, ఆ తర్వాత మళ్లీ సినిమా గురించిన ప్రస్తావన వస్తే.. 'చూద్దాం...చేద్దాం' అన్న తరహాలోనే మాట్లాడుతూ వచ్చారు. కేంద్రంలో తనకు మంత్రి పదవి వస్తుందన్న ఆశతో వుండడం వల్లే సినిమా చేయడంపై ఆయన ఏ నిర్ణయమూ తీసుకోలేకపోయారు. అయితే, ఇప్పుడిక మంత్రి పదవి రాదని తేలిపోవడంతో సినిమాకు రెడీ అవుతున్నారు.
నిన్న తిరుపతి పర్యటనలో చిరంజీవి ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు కూడా. తన 150 వ సినిమా త్వరలో ఉంటుందనీ, రామ్ చరణ్ తేజ్ దానికి నిర్మాతగా వ్యవహరిస్తాడనీ ఆయన చెప్పారు. సోదరుడు నాగబాబు కోరికపై మళ్లీ నటిస్తున్నానని చెప్పారాయన. ఆమధ్య చరణ్ తో 'ఆరెంజ్' సినిమా తీసి, బాగా అప్పుల్లో వున్న నాగబాబుకి ఆర్ధికంగా సహాయపడడానికి ఈ సినిమాను చరణ్ బ్యానర్ పై తీస్తున్నారని తెలుస్తోంది.
అయితే ఇంతకీ తన 150వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ చిరంజీవి, వివి వినాయక్ కి ఇస్తారా? పూరి జగన్నాథ్ చేతుల్లో 150వ సినిమాని చిరంజీవి పెడ్తారా? వీరిద్దర్నీ కాదని ఇంకో డైరెక్టర్ ని చిరంజీవి తెరపైకి తెస్తారా...?ప్రస్తుతానికి ఇది సస్పెన్సే...అన్నట్టు సెప్టెంబర్ 2 నుంచి తిరుపతి లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పర్యటిస్తానని చిరంజీవి ప్రకటించడం కొసమెరుపు...

No comments:
Post a Comment