Tuesday, 30 August 2011

సెక్సువాలిటి కథలో భాగం: రాజమౌళి

రాజమౌళి రీసెంట్ గా ట్వీట్ చేస్తూ...సెక్సవాలిటి అనేది కథలో ఓ కీలకమైన అంతర్భాగం. దాన్ని ఎవాయిడ్ చేయలేము. కానీ వల్గారిటీని ఎప్పుడూ ఎవాయిడ్ చేయ్యాల్సిందే. నేను ఎప్పుడూ అదే చేస్తూంటాను అన్నారు. ఆయన్ని ట్విట్టర్ లో ఓ వ్యక్తి మీ సినిమాల్లో సెక్సువాలిటిని ఎవాయిడ్ చేస్తే బావుంటుంది అన్నదానికి సమాధానంగా ఇలా స్పందించారు. అపజయం అంటూ ఎరగని రాజమౌళి మొదటనుంచి హీరోయిన్స్ ని సెక్సీగా చూపించటం అలవాటే. విక్రమార్కుడులో అనూష్కని, ఛత్రపతిలో శ్రియని, మగధీరలో కాజల్ ని ఇలా హీరోయిన్స్ అందరని సెక్సీగా చూపించి మాస్ నుంచి మార్కులు కొట్టేసారు. ఆ విషయంలో ఆయన తన గురువు రాఘవేంద్రరావుని ఫాలో అవుతూంటారు.

ఇక ప్రస్తుతం రాజమౌళి ఈగ చిత్రం బిజీలో ఉన్నారు. సమంత, నాని జంటగా నటిస్తున్న ఈ చిత్రం గ్రాఫిక్స్ ప్రధానంగా సాగుతుంది. ‘ఈగ’ సబ్జెక్ట్ సెంట్రల్ పాయింట్ ఏమిటంటే ‘తను ప్రేమించిన అమ్మాయితో హ్యాపీగా లవ్ స్టోరీ నడుపుతోన్న ఓ అబ్బాయి అతి క్రూరుడైన విలన్ చేతిలో ప్రాణాలు కోల్సోతాడు. అయితే ‘ఈగ’ రూపంలో మరుజన్మ ఎత్తిన ఆ కుర్రాడిని గత జన్మ జ్ఝాపకాలు వెంటాడతాయి. దాంతో ‘ఈగ’ గానే విలన్ పై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తాడు. కాగా తనకంటే ఓ ఐదు లక్షల రెట్లు శక్తిమంతడైన ఓ మనిషిపై.. అదీ ఓ పరమ క్రూరుడిపై ఆ ‘ఈగ’ ఎలా గెలిచిందీ.. ఆ గెలుపు కోసం ఏమేం చేసిందీ’ అన్నదే క్లుప్తంగా ‘ఈగ’ కథాంశం.

No comments:

Post a Comment