దూకుడు సినిమా పోకిరి లాగానో, ఒక్కడు లాగానో ఉండాలని డిజైన్ చెయ్యలేదు.
మంచి ఎమోషన్, కామిడీ ని కలిపి బ్లెండ్ చేస్తూ చెప్పిన ఒక కొడుకు కథ
అంటున్నారు రచయిత గోపీ మోహన్. ఆయన ఈ చిత్రం గురించి తన ట్విట్టర్ ఎక్కౌంట్
లో ఇలా ట్వీట్ చేసారు. అలాగే బేసిగ్గా నేను కృష్ణగారి అభిమానిని. కృష్ణగారు
సాహసానికి మరో పేరని అంటుంటారు. ఈ సినిమాలో హీరో ఓ డైలాగ్ చెబుతాడు "మా
నాన్నెప్పుడూ ఒకటంటుండేవాడు 'సాహసమే ఊపిరిగా బతికేవాడికి దారితో పనిలేదు
దమ్ముతోనే పని' అని". ఈ డైలాగ్ మంచి సందర్భంలో వస్తుంది. దాన్ని అందరూ
కృష్ణగారితో ఐడెంటిఫై చేసుకుంటారు అంటున్నారు రైటర్ గోపీమోహన్. ఆయన కథ
రాసిన దూకుడులో డైలాగుల గురించి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే
దూకుడులో పంచ్ డైలాగుల ప్రాధాన్యత వివరిస్తూ...ఫ్రాంకుగా చెప్పాలంటే కొన్ని
డైలాగులు నాకు శ్రీను గారు చెప్పేటప్పుడు "ఈ డైలాగుల్లో ఇంత పంచ్ ఉందా?"
అనిపించింది. ఉదాహరణకి "మైండులో ఫిక్సయితే బ్లైండుగా వెళ్లిపోతాను' అనేది.
ఆయన 'ఇది చూడండి. భలే ఉంటుంది' అనేవారు. డబ్బింగ్ అయిపోయి ట్రైలర్
వదిలినప్పుడు దానికొచ్చిన రియాక్షన్ చూసి నేనే షాకయ్యా 'ఇంత రియాక్షన్
ఉంటుందా' అని. ఇలాంటివి సినిమాలో చాలా ఉన్నాయి.
ఆయన పర్టిక్యులర్‌గా ఫిక్సయి రాశారు. శ్రీను గారు చెబుతూ వచ్చారు - "ఇప్పటివరకు మనం సాఫ్ట్ సినిమాలు చేస్తూ వచ్చాం. కామెడీ సీన్లలో తప్ప పవర్‌ఫుల్ డైలాగ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చెయ్యలేదు. ఈ సినిమా దానికి లాంచింగ్‌గా ఉండాలి. ఇక నుంచీ మనల్ని కూడా అలాంటి డైలాగ్స్ పెట్టమనేటట్లుండాలి" అని. ఇందులో డైలాగ్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సైడ్ వచ్చేసరికి శ్రీను వైట్ల తరహాలోనే ఉంటాయి. యాక్షన్, పవర్‌ఫుల్ సైడ్ వచ్చేసరికి మహేశ్ తరహాకి మేం వెళ్లాం. ఆయన కూడా అదే స్టైల్‌కి మలుచుకుని చెప్పారు. ఇందులోని డైలాగుల్లో 'పోకిరి' షేడ్స్, 'రెడీ' షేడ్స్ రెండూ కనిపిస్తాయి. అయితే ప్రేక్షకులకి ఇది కావాలని చేసినట్లు ఏమాత్రం అనిపించదు. కథే బలంగా ఎలివేట్ అవుతూ వెళ్తుంది. మీరు చూసినప్పుడు కూడా అదే ఫీలవుతారు అన్నారు.ఇక ఈ చిత్రంలో మహేష్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. కామిడి ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మహేష్ సరసన సమంత హీరోయిన్ గా చేస్తోంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గోపీ మోహన్ కథ, కోన వెంకట్ మాటలు అందిస్తున్నారు.

No comments:
Post a Comment