Thursday 1 September 2011

హిందీ 'ఠాగూర్‌' కు ఆ హీరోనే ఫైనల్

ఎనిమిదేళ్ల కిందట చిరంజీవి నటించిన 'ఠాగూర్‌' చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్‌ చేయబోతున్న సంగతి తెలిసిందే. హిందీ 'ఠాగూర్‌'లో అమీర్‌ ఖాన్‌ హీరోగా నటించేందుకు అంగీకరించారని సమాచారం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న అన్నాహజారే స్ఫూర్తితో 'ఠాగూర్‌'ని పునర్నిర్మించాలన్నది నిర్మాత మధు మంతెన ఆలోచన. ఆయన మాట్లాడుతూ ...ఎనిమిదేళ్ల కిందట తెలుగులో 'ఠాగూర్‌' చిత్రం వస్తేనే ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు పరిస్థితులు ఈ సినిమా హిందీలో రావడానికి దోహదం చేస్తున్నాయి. అన్నా ఓ వైపు అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

ఈ చిత్రంలోనూ ఏసీఎఫ్‌ పేరుతో అవినీతికి పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షిస్తాడు కథానాయకుడు. త్వరలోనే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాల్ని వెల్లడిస్తామన్నారు. 'ఠాగూర్‌' కి తమిళ చిత్రం 'రమణ' ఆధారం..ఇక ఈ చిత్రం తమిళంలో రమణ టైటిల్ తో తెరకెక్కింది. విజయకాంత్ ఈ చిత్రంలో హీరోగా చేసారు.ఓ ప్రొఫెసర్ అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే కథాంశంగా సినిమా రూపొందింది.అక్కడ విజయవంతమవటంతో తెలుగులో దాన్ని రీమేక్ చేసి హిట్ కొట్టారు.ఎ.ఆర్.మురగదాస్ ఈ చిత్రాన్నిడైరక్ట్ చేయనున్నాడు. మురుగదాస్,అమీర్ ఖాన్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన గజనీ చిత్రం ఘన విజయం సాధించింది.అప్పుడూ గజనీని మధు మంతెనే నిర్మించారు.

No comments:

Post a Comment