Tuesday 30 August 2011

పవన్ సోదరుడుగా ఆ యంగ్ విలన్

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో హీరోతో పాటు అతని సోదరుడు పాత్ర కూడా కీలకమైనదే. ఆ పాత్రలో యంగ్ విలన్ అజయ్ ని తీసుకున్నట్లు సమాచారం. సెప్టెంబర్ ఏడవ తేది నుంచి షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం కోసం అజయ్ డేట్స్ బల్క్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం ఒరిజినల్ దబాంగ్ లో అర్బాజ్ ఖాన్ ఆ పాత్రను చేసారు. ఇక అజయ్ సారాయి వీర్రాజు చిత్రంలో హీరోగా చేసారు కానీ వర్కవుట్ కాకపోవటంతో తిరిగి విలన్ వేషాలకు వెనక్కి వచ్చాడు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్... సంఘమిత్ర ఆర్ట్స్‌, ఆర్కా మీడియా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రంలో చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా సారాజేన్‌ డైస్‌, అంజని లావని కథానాయికలుగా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తమిళంలో భిళ్లా చిత్రం రూపొందించిన విష్ణువర్థన్‌ దర్శకుడు. కోల్‌కతా నేపథ్యంలో జరిగే కథ ఇది. అక్కడే చాలా భాగం షూటింగ్ చేసారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. ఈ చిత్రంలో పవన్‌ పాత్ర చిత్రణ, వేషధారణ కొత్త పంథాలో ఉంటాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సెప్టెంబరు 2న పవన్‌ జన్మదినం సందర్భంగా టైటిల్‌ ప్రకటిస్తారు. ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, సంగీతం: యువన్‌ శంకర్‌రాజా.

No comments:

Post a Comment