మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ తన చిన్నాటి స్నేహితురాలు, ప్రియురాలు ఉపాసన కామినేనితో పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. వెడ్డింగ్ డేట్ ఫిక్స్ కావడం ఒక్కటే ఆలస్యం. త్వరలోనే ఇందుకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తామని చరణ్ తో పాటు చిరంజీవి కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేశారు కూడా..
విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం వీళ్ల పెళ్లి దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగనున్నట్లు తెలుస్తూంది. చరణ్ పెళ్లిని తన రాజకీయ వేదికగా ఉపయోగించుకోవడంలో భాగంగానే చిరంజీవి ఈ ప్లాన్ వేసినట్లు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్ని ఉద్యమ పరిస్థితుల నేపథ్యంలో ఆహ్వానం పలికినా...సోనియా, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్ ప్రముఖులు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి పెళ్లి వేదికనే ఢిల్లీలో ఏర్పాటు చేయాలనేది చిరంజీవి ఆలోచనట. ఇలా చేయడం ద్వారా దేశ వ్యాప్తంగా తన పేరు మార మ్రోగడంతో పాటు, చరణ్ ను కూడా జాతీయ నేతలకు పరిచయం చేసినట్లవుతుందని ఆయన అభిప్రాయంగా కనిపిస్తోంది.
అయితే అభిమానులు అసంతృప్తికి గురి కాకుండా హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేస్తే సరిపోతుందని, ఈ విషయం అభిమానులకు అర్థం చేసుకునే విధంగా ప్రత్యేక సమావేవాలు ఏర్పాటు చేసి వివరించాలనరి నాగబాబు తదితరులకు సూచించాడట మెగాస్టార్.

No comments:
Post a Comment